అగార్కర్ పై నెటిజన్లు ఆగ్రహం...

SMTV Desk 2017-11-11 14:34:36  ajith agarkar, dhoni, social media viral, twitter

న్యూఢిల్లీ, నవంబర్ 11 : అజిత్ అగార్కర్ భారత్ జట్టు తరుపున ఆడినప్పుడు కూడా ఇంత ప్రచారం జరగలేదేమో..! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతనిపై ఫుల్ దుమారం రేగుతుంది. దీనికి కారణం టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనిపై చేసిన విమర్శలే.. టీ20లకు ధోని పనికిరాడని.. అతనికి ప్రత్యామ్నాయం వెతకాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై సునీల్‌ గావ‌స్క‌ర్‌‌, రవిశాస్త్రి, సెహ్వాగ్‌లతోపాటు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ధోనికి మద్దతు పలికారు. తాజాగా ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అజిత్‌ అగార్కర్‌కు చురకలు అంటిస్తున్నారు. అందులో కొన్ని... అగార్కర్‌ ధోనిపై విమర్శలు చేయడమంటే.. ఓ స్థానిక ఎమ్మెల్యే.. ప్రధానమంత్రిని విమర్శించడమే’ ఎవరూ ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో నిర్ణయించడానికి నీవెవరూ? నీ వ్యాఖ్యలతో నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు’ ‘పనిచేయడానికి ఏమీ లేదు.. అందుకే మీడియా ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నావ్‌’