క్రికెటర్ కు తప్పిన ప్రమాదం...

SMTV Desk 2017-11-11 13:16:50  ranji trophy, vidrbha, crickter aditya sarvathe, west bengal

పశ్చిమ్ బెంగాల్, నవంబర్ 11 : రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భ ఆటగాడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విదర్భ-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు బలంగా బంతి తగలడంతో క్రీజ్ లో కుప్పకూలిపోయాడు. ఆటలో భాగంగా బెంగాల్ బౌలర్ ఇషాన్ పోరెల్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో, బాల్ ఆదిత్యా సర్వాతే తలకు బలంగా తాకింది. వెంటనే బెంగాల్ జట్టు సభ్యుల సాయంతో గ్రౌండ్ సిబ్బంది అతన్ని మైదానంలోకి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.