కోహ్లి ని కలుస్తా... క్రికెట్ పాఠాలు నేర్చుకుంటా: మాజీ ఛాంపియన్

SMTV Desk 2017-11-11 12:48:34  fin balore, wrestler, kohli, crickter, india

న్యూఢిల్లీ, నవంబర్ 11 : భారత్ క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లి దగ్గర ఓ మాజీ ఛాంపియన్ క్రికెట్ పాఠాలు నేర్చుకుంటడంటా..! అయితే కోహ్లి దగ్గర పాఠాలు నేర్చుకుంటానన్నది క్రికెటర్‌ కాదు డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్‌, ఐర్లాండ్‌ రెజ్లర్‌ ఫిన్‌ బాలోర్‌. డిసెంబర్ లో వచ్చే నెల జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ ఆధ్వర్యంలో రెండు గేమ్‌లు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకే అతడు మన దేశానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా బాలోర్ మాట్లాడుతూ" ఇండియాలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న క్రికెట్‌ గురించి నాకు ఏమీ తెలియదు. నేను క్రికెట్ ఎక్కువగా చూడను. గతంలో మా జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంటే టీవీలో కొద్దిసేపు మాత్రం చూశాను. డిసెంబర్ పర్యటనలో భాగంగా నేను కోహ్లీని కలుస్తా, అతడి దగ్గర నుండి పాఠాలు నేర్చుకుంటా అన్ని కుదిరితే అతనితో ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడతా. క్రికెట్ లో భారత్‌-ఐర్లాండ్‌ తలపడుతుంటే చూడాలని ఉంది" అని వ్యాఖ్యానించారు