ట్విట్టర్ లో వెరిఫికేషన్ బంద్

SMTV Desk 2017-11-11 11:59:58  twitter verification stop, social media, twitter, verified account

న్యూఢిల్లీ, నవంబర్ 11 : ప్రముఖ సామాజిక మాధ్యమము ట్విట్టర్ వెరిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ట్విట్టర్ ఖాతాలో పేరు పక్కన నీలం రంగు చెక్‌ మార్క్‌ ఉందంటే, అది సదరు వ్యక్తుల వెరిఫైడ్‌(ట్విటర్‌ ధ్రువీకరించిన ఖాతా) అకౌంట్‌ అని అర్థమవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు, ప్రముఖుల ట్విటర్‌ ఖాతాల్లో ఈ మార్క్‌ కన్పిస్తుంది. ‘వెరిఫికేషన్‌ అనేది సదరు ఖాతా ఆ వ్యక్తిదే అని ధ్రువీకరించేందుకు చేస్తాం. కానీ అదీ కీలక, ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారనే భావన నెటిజన్లలో కలిగింది. ప్రజల్లో ఇలాంటి కన్ఫ్యూజన్‌ ఉందని అర్థమైంది. అందుకే దీన్ని పరిష్కరించేందుకు ట్విట్టర్ వెరిఫికేషన్‌ను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ తీసుకొస్తాం’ అని సంస్థ పేర్కొంది.