వృద్ధులు, దివ్యాంగులు కోసం ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

SMTV Desk 2017-11-11 11:27:33  rbi new rule, for old persons, physical handcap persons, mumbai

ముంబై, నవంబర్ 11 : వృద్ధులు, దివ్యాంగులు, బ్యాంక్ లకు వెళ్లి నగదు తీసుకోవడం, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం ఇక లేదు. వీరందరికీ చేయుతనిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు నగదు కోసం పడిగాపులు కాయకుండా, ఇంటి వద్దనే బ్యాంకులను ప్రాథమిక సర్వీసులు అందజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్‌ బుక్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్‌ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్‌ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. 2017 డిసెంబర్‌ 31 నుంచి ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ సేవలకుగాను ఎంత మొత్తంలో రుసుములు విధిస్తారో ఇంకా ఆర్‌బీఐ స్పష్టం చేయలేదు.