ప్రపంచ వారసత్వ సంపదగా "రామప్ప"..!

SMTV Desk 2017-11-11 11:27:17  Ramappa temple, Legacy recognition, Unesco consultant, Kudamani Nandagopal

హైదరాబాద్, నవంబర్ 11 : కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించేందుకు రంగం సిద్దమైంది. రామప్ప ఆలయ నిర్మాణం ఒక అద్భుతమని, ప్రపంచ వారసత్వ హోదా పొందడానికి అన్ని అర్హతలు ఉన్నట్లు ఈ ఆలయంపై అధ్యయనం చేసిన ప్రఖ్యాత యెనెస్కో కన్సల్టెంట్‌ చూడామణి నందగోపాల్‌ నివేదిక (నోట్‌)ను తెలంగాణ పురావస్తు శాఖకు సమర్పించారు. ఈ విషయంపై త్వరలోనే స్టేక్‌హోల్డర్స్‌తో పురావస్తు శాఖ డైరెక్టర్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి ఉన్న అర్హతలను వివరిస్తూ యునెస్కోకు పంపే సమగ్ర దరఖాస్తు (డోసియర్‌)ను ఈ సమావేశంలో నిర్ణయి౦చనున్నారు.