2021 నాటికి ఇంటర్నెట్ యూజర్లు

SMTV Desk 2017-06-10 16:12:12  internet, traffic, sisco, 60percent

న్యూఢిల్లీ, జూన్ 10 : ప్రస్తుత సంవత్సరం కేవలం 28 శాతం ఉన్న ఇంటర్నేట్ యూజర్లు 2021 నాటికి 60 శాతానికి పెరుగుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు సిస్కో విజువల్ నెట్ వర్కింగ్ ఇండెక్స్ నివేదిక అంచనాలను రూపొందించింది. రానున్న 5జీ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వృద్ధి చెందడానికి అవకాశం ఉందని వెల్లడవుతున్నది. 2016 సంవత్సరం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 37. 3 కోట్లతో జనాభాలో 28 శాతం నమోదు కాగా, 2021 నాటికి రెండింతలకు పైగా పెరిగి 82.9 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. 2016 లో దేశంలో 140 కోట్ల నెట్ వర్కింగ్ డివైజ్ లున్నాయి. 2021 నాటికి వీటి సంఖ్య 200 కోట్లకు చేరనుందని అంచనా. వచ్చే ఐదేళ్ళ కాలంలో దేశంలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ట్రాఫిక్ నాలుగురెట్లు వృద్ధి చెందే అవకాశం ఉందని, అంటే వార్షికంగా సగటున 30 శాతం వృద్ధికి అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వేగవంతమైన అధిక బ్యాండ్ విడ్త్ డేటా, వీడియో, అడ్వాన్స్ డ్ మల్టీ మీడియా అప్లికేషన్లు వంటివి మెుబైల్, వైపై ట్రాఫిక్ పెరిగెందుకు దోహదపడుతున్నట్లు వివరాలు వెల్లడించారు.