ధోని సత్తా మాకు తెలుసు : రవిశాస్త్రి

SMTV Desk 2017-11-11 10:41:02  ravisastri, dhoni, goutham gambhir, indian coach

ముంబై, నవంబర్ 11 : కివీస్ తో జరిగిన టీ-20 లో భారత్ మాజీ కెప్టెన్ ధోని విఫలమవ్వడంతో అతని పై విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన మాజీ క్రికెటర్ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌, గౌతమ్ గంభీర్, టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లి, ధోనికి తమ మద్ద్దతు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా భారత్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయం పై స్పందిస్తూ " కొందరు అసూయపరులు ధోనికి చెడ్డ రోజులు రావాలని కోరుకుంటున్నారు. ధోని సత్తా ఏంటో మాకు తెలుసు. ఇంతక ముందు నాయకుడిగా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.ఆటగాడిగా కూడా తను రాణిస్తున్నాడు. గతంలో జరిగిన శ్రీలంక, ఆస్ట్రేలియాలపై మ్యాచ్‌లు గెలిపించాడు " అని వ్యాఖ్యానించారు.