యువరాజ్, రైనా భారత్ జట్టులో ఉండాలి : అజరుద్దీన్

SMTV Desk 2017-11-10 19:21:56   Mohammad Azharuddin , raina, yuvaraj, india cricket team

న్యూఢిల్లీ, నవంబర్ 10 : ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టులో స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పరిస్థితిలో సీనియర్ ఆటగాళ్ల చోటు సందిగ్ధంలో పడింది. అందులో ముందుగా వినపడే పేర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా.. వీరిద్దరూ మళ్లీ భారత్ జట్టులో చోటు సంపాదిస్తారా? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే వీరికి ఊహించని మద్దతు టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ ను౦డి లభించింది. భారత క్రికెట్ జట్టులో యువీ-రైనాలు ఉండాల్సిన అవసరం ఉందంటూ అజరుద్దీన్ స్పష్టం చేశాడు.