శ్రీలంక తో టెస్టు సిరీస్ భారత్ జట్టు ప్రకటన...

SMTV Desk 2017-11-10 17:57:26  INDIA TEAM, SRILANKA TEST SERIES, BCCI, MUMBAI

ముంబై, నవంబర్ 10 : శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు అనూహ్యంగా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. దీర్ఘకాలిక మ్యాచ్ లను దృష్టిలో పెట్టుకొని పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. భారత్ సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి జట్టులోకి స్థానం సంపాదించుకున్నారు. భారత్ జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (ఉప సారథి), రోహిత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ.