పాక్ కు షాక్...

SMTV Desk 2017-11-10 15:51:48  west indies tour, pakisthan, pcb board, 3 t-20 series

కరాచీ, నవంబర్ 10 : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. శ్రీలంక రాకతో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ సందడి మొదలైందని సంబరపడుతున్న పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశంలో టీ-20 సిరీస్ ఆడేందుకు కరేబియన్ ఆటగాళ్లు విముఖత చూపడంతో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు పాక్ తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు నవంబరు లేదా డిసెంబరులో పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌ ఆడాలని నిర్ణయించింది. ఐతే భద్రత కారణాల దృష్ట్యా వెస్టిండీస్‌ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, పోలార్డ్, బ్రావో, ఈ టూర్ కి నిరాకరించారు.