విరాట్ ఫేవరెట్ గేమ్ ఏంటో తెలుసా..?

SMTV Desk 2017-11-10 15:32:50  kohli second favorite game, badminton, football, team india cricket captain

న్యూఢిల్లీ, నవంబర్ 10 : టీమిండియా కెప్టెన్ కోహ్లికి క్రికెట్ తర్వాత ఇష్టమైన ఆట ఏమని ఎవరినైనా అడిగితే ఫుట్ బాల్ అని చెప్తారు. ఎందుకంటే కోహ్లి క్రికెట్ తర్వాత ఫుట్ బాల్ ఆడటం ఎక్కువ మంది చూశారు కాబట్టి. అంతే కాదు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో సహచర ఆటగాళ్లతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ ఉంటాడు. కానీ, కోహ్లికి ఇష్టమైన ఆట ఫుట్ బాల్ కాదు... ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. నిన్నజరిగిన ఓ కార్యక్రమంలో కోహ్లీని క్రికెట్‌ తర్వాత ఏ క్రీడ ఆడటమంటే ఎక్కువ ఇష్టమని అడగగా.. బ్యాడ్మింటన్ అని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లి శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు.