దివికేగిసిన మాజీ క్రికెటర్‌ దిగ్గజం...

SMTV Desk 2017-11-10 15:26:29  former cricketer milkha singh, cricketer passed away

చెన్నై, నవంబర్ 10: బాట్స్ మెన్ గానైన, ఫీల్డర్ గానైన తన కంటూ ఒక ప్రత్యేక శైలితో క్రికెట్ అభిమానులకు తన సత్తా చూపిన టీమిండియా మాజీ క్రికెటర్‌ ఏజీ మిల్కాసింగ్‌ (75), గుండెపోటుతో ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ ఏట తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. 1960వ దశకంలో మిల్కాసింగ్ టీమిండియాలోకి ప్ర‌వేశించి నాలుగు టెస్టులు ఆడారు. ఎనిమిది సెంచ‌రీల‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 4,000 పరుగులు చేశారు.