రూపే క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.!

SMTV Desk 2017-11-10 14:09:42  rupay credit cards, through npci, public ,private sector banks, bhim app

హైదరాబాద్, నవంబర్ 10 : తాజాగా రూపే క్రెడిట్ కార్డులను జారీచేసేందుకు 10 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ లు ముందుకు వచ్చాయి. ఇప్పటికే కొన్ని బ్యాంక్ లు ప్రయోగాత్మకంగా కార్డులు అందించాయని, త్వరలోనే ఇతర కస్టమర్లకు కూడా ఈ కార్డులు ఇవ్వనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రతినిధి తెలిపారు. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో (ఎన్ పిసిఐ) ప్రతినిధి మాట్లాడుతూ “ ఇప్పటికే రూపే డెబిట్ కార్డును 900కు పైగా బ్యాంక్ లు జారీచేశాయని, గత ఆగష్టు 20 నాటికీ 40 కోట్ల పైగా కార్డులు విపణిలోకి వచ్చాయని వివరించారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే దిశగా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగదారులకి అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా డిజిటల్ చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన యుపిఐ ఆధారిత భీమ్(భారత్ ఇంటర్ పేస్ ఫర్ మనీ) యాప్ కు విశేష ఆదరణ లభించిదని పేర్కొన్నారు.