యువత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి : కోహ్లి

SMTV Desk 2017-11-10 11:49:03  kohli message to youth, for using of socilal media, kohli team india captain, one 8 brand

న్యూఢిల్లీ, నవంబర్ 10 : భారత్ క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లి యువత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు. శారీరిక శ్రమ లేకపోతే మునుముందు చాలా కష్టాలు ఎదుర్కొంటారని, ఈ పరిస్థితిలో మార్పు అవసరమని యువతని హెచ్చిరించాడు . తన బ్రాండ్‌ ‘పూమా’తో కలిసి కోహ్లి కొత్తగా వన్‌8 అనే సొంత బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ "నేటి సమాజంలో కుర్రాళ్లు ఔట్ డోర్ ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, వాటికి బదులు వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాను వాడుకోవచ్చు కానీ అలవాటు పడిపోకూడదు. నేను కూడా గతంలో సామాజిక మాధ్యమాలకు బాగా సమయం వెచ్చించేవాడిని, అయితే వాటి వల్ల సమయం వృధా అని తర్వాత అర్దమైంది. వాటి నుండి దూరంగా క్రీడలును ఎంచుకున్నాని" తెలిపారు