జియో చూపు ..వర్చువల్‌ రియాలిటీ వైపు..

SMTV Desk 2017-11-10 11:16:49  jio vr, vr app, reliance, barminghome,

న్యూఢిల్లీ, నవంబర్ 10 : ఇప్పటికే మొబైల్ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో చూపు వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) మీద పడింది. అనుకున్నవన్నీ జరిగితే వచ్చే ఏడాదిలో జియో వీఆర్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల సమాచారం. జియోకు చెందిన కొందరు నిపుణులు బర్మింగ్‌హమ్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ వీఆర్ సంస్థ ప్రతినిధులతో ఈ యాప్ గురించి చర్చించారని తెలుస్తుంది.