బుమ్రా వల్లే కివీస్ ఓడిపోయింది : స్కాట్‌ స్టైరిస్‌

SMTV Desk 2017-11-10 10:31:53  Jasprit Bumrah, Scott styris, New Zealand, India

ముంబై, నవంబర్ 10 : కివీస్ పై కోహ్లి సేన వన్డే సిరీస్ ను, టీ-20 సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ పర్యటన న్యూజిలాండ్ జట్టుకు చేదు అనుభవం మిగిలించింది. దీనిపై కివీస్ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ స్పందిస్తూ " ఈ సిరీస్ లలో భారత్ కు విజయాన్ని అందించిన ఘనత బుమ్రాకే దక్కుతుంది. అతని అద్భుత ప్రదర్శన వల్ల మా జట్టు ఓడిపోయిందని, అతను లేకపోతే రెండు సిరీస్ లను న్యూజిలాండ్ 2-1 తో సొంతం చేసుకునేది" అని స్టైరిస్‌ ట్వీట్‌ చేశారు. వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో 338 పరుగుల లక్ష్యాన్ని చేధించేల కనిపించిన, బుమ్రా (3/47) అదిరే బౌలింగ్ తో చెలరేగిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ (2/9) చేసి టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు.