సామాజిక భాద్యత దిశగా ఫెకోపిడియా...

SMTV Desk 2017-11-09 20:02:25  fakopedia, ashok palaparthy, hyderabad, social media issues

హైదరాబాద్, నవంబర్ 09 : ఈ ప్రపంచంలో నిజం తెలిసే లోపు అబద్ధం అన్ని వైపులా ఆవరిస్తుంది. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాలో వచ్చే చాలా విషయాలు ఫేక్, కానీ అవి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో వచ్చే విషయాలు ఎంత వరకు నిజం ..? ఎంత వరకు అబద్దం ..? చెప్పేదే ఎవరు..? అయితే ఈ వార్తల అసలు విషయం తేల్చేందుకు , అటువంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ముందుకొచ్చిన సంస్థ " ఫెకోపిడియా.కామ్". ఈ వెబ్ సైట్ స్థాపకుడు అశ్విన్ పాలకుర్తి. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఎవరైనా ఈ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. fakopedia.com పేరుగా ఉన్న ఈ సైట్ కు రోజుకు 5000వేల మంది యూనిక్ యూజర్లు ఉన్నారు. fakopedia పేరు మీద పేస్ బుక్ పేజిని కూడా ఏర్పాటు చేశారు. ఫెకోపిడియా కు సంబంధించి 9892050005 వాట్సప్ నెంబర్ కూడా ఉంది.