వాసన ద్వారా రోగాలను నిర్ధారించవచ్చా..!

SMTV Desk 2017-11-09 19:16:39  Electrical Nose Test, Techniyan Israel Institute of Technology, scientist.

ఇజ్రాయిల్, నవంబర్ 09 : జ్వరం వస్తే థర్మామీటర్ తో చూస్తే అర్థమవుతోంది. మరి ఎన్ని టెస్టులు చేసినా సమస్యను తెలుసుకోలేకపోతే ఎలా..? అలాంటప్పుడు ఏం చేయాలి.! దీని కోసం ఎలక్ట్రికల్ నోస్ టెస్ట్ ట్రై చేయమంటున్నారు ఇజ్రాయిల్ శాస్రవేత్తలు. ఈ టెక్నాలజీ వల్ల మనవ శరీరంలో ఉన్న 17 రోగాలను గుర్తించవచ్చంటున్నారు. మానవుడు ఏ వ్యాధితో బాధ పడుతున్నాడో తెలుసుకోవచ్చని “టెక్నియాన్ ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పరిజ్ఞానంతో వివిధ రకాల క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు, 85 శాతం గుర్తించవచ్చు. దీనికోసం నానో నోస్ టెక్నాలజీలో సెన్సార్ ఛా౦బర్, బ్రీతింగ్ ట్యూబ్ ఇలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉంటాయి. ఈ ప్రక్రియలో రోగి శ్వాస తీసుకోగానే ఈ వ్యాధి లక్షణాన్ని సెన్సార్లు స్మెల్ చేస్తాయి. వ్యాధి నిర్ధారణకు ఈ పద్ధతి చాలా సురక్షితమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.