జేసీబీతో ఏటీఎం దోపిడీ విఫలయత్నం

SMTV Desk 2017-06-10 15:10:21  America,ATM,Maryland,JCB,Social websites

అమెరికా, జూన్ 10 : సినిమాల ప్రభావం ప్రపంచంలోనే ఎక్కువగా ఆకర్షిస్తుంది. సినిమాను అనుసరించి నిత్యజీవితంలో కూడా కొన్ని పనులను చేస్తుండటం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అమెరికాలోని ఒక నగరంలో ఏటీఎంను కొల్లగొట్టడానికి ఒక దొంగ ప్రత్యేకమైన ప్రణాళికను వేసుకొని, చిన్న చిన్న రాళ్ళతో కొడితే ప్రయోజనం లేదని భావించి, ఏకంగా జేసీబీ పరికరాన్ని వాడి డబ్బులు కాజేయాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, లాభం లేకుండా ఉండడం తో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఈ ఘటన జూన్ 1 వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్ లో జరిగింది. దీనికి సంబంధించిన చిత్రాలను అక్కడ ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు స్వాధీనపర్చుకుని ప్రసార మాధ్యమాలలో విడుదల చేయడంతో ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.