అరుణ్ సాగర్ అవార్డులకు ఆహ్వానం..

SMTV Desk 2017-11-09 18:55:24  journalist arun sagar, entry for awards, telangana press chairman allam narayana.

హైదరాబాద్, నవంబర్ 09 : దివంగత జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టు అవార్డులకు ఎంట్రీలను పంపించాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఎంపికైన జర్నలిస్టులకు అరుణ్ సాగర్ జయంతి రోజున తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా నుండి ముగ్గురికి, ప్రింట్ మీడియా నుండి ముగ్గురికి జర్నలిస్ట్ అవార్డులతో పాటు ప్రశ౦సా పత్రంతో పాటు జ్ఞాపిక అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవార్డుల ఎంపికకు సాక్షి ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ కే. రామ చంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ కట్టా శేఖర్ రెడ్డిలు జ్యూరీగా వ్యవహరించనున్నారు.