అన్నలు కాదు.. మృగాలు..

SMTV Desk 2017-11-09 15:34:15  crime, brother harassment on sister, jagital,

జగిత్యాల, నవంబర్ 9 : అన్న చెల్లెళ్ల అనుబంధం, జన్మజన్మల సంబంధం అంటుంటారు పెద్దలు. కానీ ఈ అన్నయలు, రక్త సంబంధాన్ని మర్చిపోయి తన చెల్లెలిపై కర్కశంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కేంద్రం వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత కన్నీటి గాధ ఇది. ఆమెకు నారాయణ, రమేష్, శ్రీనివాస్ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. వారితోనే కలిసి ఉంటోంది. కొంతకాలంగా అన్న, వదినల వేధింపులు తట్టుకోలేక కాలనీ వాసులకు మోర పెట్టుకుంది. చివరికి వెట్టిచాకిరి చేయలేక ఆమె ఇంట్లో నుండి పారిపోగా, అన్న వదినలు వెతికి మరి పట్టుకొని చేతికి గొలుసులు కట్టి తీవ్రంగా హింసించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ విషయం బయటపడింది.