కేసీఆర్ పై అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసల జల్లు...

SMTV Desk 2017-11-09 15:10:30   akbaruddin majlis, comments on kcr, telangana, muslim reservation, congress

హైదరాబాద్, నవంబర్ 09 : రాష్ట్రంలో జరిగే 2019 ఎన్నికల్లో ఆధికార పీఠం టీఆర్‌ఎస్ పార్టీదేనని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ స్థాయికి సీఎం పదవి చాలా చిన్నదని అభివర్ణించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదని, కేసీఆర్ వ్యూహం, చాతుర్యంతోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని స్పష్టంచేశారు. ముస్లింలకు రిజర్వేషన్లపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూల దృక్పధంతో ఉందని, ఐఏఎస్, ఐపీఎస్, వంటి పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ విద్యార్దులను విదేశాలలో చదువుకోనేందుకు సహకారం అందిస్తుందన్నారు. సీఎం పనితీరు చూస్తుంటే ఈ రిజర్వేషన్లు కచ్చితంగా అమలవుతాయన్న నమ్మకం తమకుందని స్పష్టం చేశారు. 70 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ బాబ్రీ మసీదు కూల్చి, వేదన మిగిలిచిందే తప్పా ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు.