బదానీ కి షాక్ ఇచ్చిన సచిన్..

SMTV Desk 2017-11-09 14:25:22  sachin shock to badani, ranji match issue, tamilnadu, mumbai, master blaster

ముంబై, నవంబర్ 09 : ముంబై రంజీ జట్టు ఈ రోజు బరోడా జట్టు తో 500 వ మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమ౦లో పాల్గొన్న భారత్ స్టార్ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అనుభవాలను, మధుర జ్ఞాపకాలును గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా 1999-2000 సీజన్‌ లో తమిళనాడుతో జరిగిన సెమీస్ లో ముంబై గెలుపు మరువలేనిదని సచిన్ పేర్కొన్నారు. టెండూల్కర్ మాట్లాడుతూ " ఆ మ్యాచ్ సమయంలో తమిళనాడు కెప్టెన్ హేమంగ్ బదానీ నేను క్రీజు బయట ఉన్నట్లు గుర్తించి బౌలర్ రాబిన్ సింగ్ కు తమిళంలో ఎలా బౌలింగ్ చేయాలో సలహా ఇచ్చాడు. రాబిన్ బౌలింగ్ వేసే సమయానికి నేను క్రీజు లోపలికి వచ్చేశాను. మ్యాచ్ అనంతరం నేను బదానీ దగ్గరకు వెళ్లి నాకు తమిళ్ వచ్చు అని చెప్పాను. దీంతో బదానీ షాక్ గురయ్యాడు" అని తెలిపారు