నల్ల కుబేరులే నోట్ల రద్దుపై నిరసన : మంత్రి

SMTV Desk 2017-11-09 12:17:01  minister ananth kumar, black day, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 9 : దేశంలో పెద్ద నోట్లు రద్దు జరిగి సంవత్సరం పూర్తైన సందర్బంగా పలువురు బ్లాక్ డే నిర్వహించారు. ఈ విషయంపై ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... గడిచిన ఏడాదిలో 33.22 లక్షల బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా, రూ. 3.68 లక్షల మేర అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ డిమానిటైజేషన్ సందర్బంగా, బోగస్ కంపెనీ ల బాగోతాలు వెలుగులోకి వచ్చాయన్నారు. దేశంలో నోట్ల రద్దుకు ముందు 18 లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు (రూ.500, 1000) రద్దు తర్వాత రూ. 6 లక్షల నోట్లకు తగ్గిపోయాయని అన్నారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని కోల్పోయిన వారే బ్లాక్ డే నిర్వహిస్తున్నారని విమర్శించారు. 2004-2014 వరకు హెలికాప్టర్ స్కాం, 2జీ స్కాం వంటి వాటితో నల్లధనాన్ని పోగు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. బొగ్గు బ్లాకులకు సంబందించిన నిధులను కూడా అప్పటి మన్మోహన్ ప్రభుత్వం వినియోగించుకుందని ఆరోపించారు.