అంకుర సంస్థలకు అండగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

SMTV Desk 2017-11-09 12:03:22  hdfc smart up zones, for start ups, hdfc bank south head, madhusudhan hegde, hyderabad

హైదరాబాద్, నవంబర్ 09 : స్టార్టప్‌ కంపెనీలకు(అంకుర సంస్థలు) అండగా నిలిచేందుకు ప్రముఖ కార్పొరేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, దేశవ్యాప్తంగా స్మార్టప్‌ జోన్స్‌ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం గచ్చిబౌలిలో స్మార్టప్‌ జోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ సౌత్‌ హెడ్‌ మధుసూదన్‌ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " స్టార్టప్‌ సంస్కృతి బాగా విస్తరించిన 30 నగరాల్లో 65 బ్రాంచిల్లో ఇలాంటి జోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో వచ్చే వారం స్మార్టప్‌ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంకుర సంస్థలు ప్రారంభించాలనుకొనే ఉత్సాహవంతులు తమ బ్యాంక్ లో కరెంట్ ఖాతా తెరిస్తే చాలని, వారికీ స్టార్టప్‌ రిజిస్టర్ చేయడం నుండి నగదు లావాదేవీల నిర్వహణ, ఇతరత్రా సేవలందిస్తాం" అని ఆయన చెప్పారు.