భారత్ లో మైనార్టీలపై దాడులు: అమెరికా

SMTV Desk 2017-11-09 11:52:41  america about religious fights in india, america

వాషింగ్టన్, నవంబర్ 09: ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం రిపోర్ట్ ప్రకారం భారత్, శ్రీలంక దేశాల్లో క్రైస్తవులు, ముస్లింలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని అమెరికా ఆరోపించింది. ఇటువంటి దాడుల సమయంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గుర్తించినట్టు అమెరికా తెలిపింది. భారత్ లో హిందువులు మైనార్టీలపై దాడులు చేస్తున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన అనేక దాడులే నిదర్శనమని అమెరికా విషం కక్కి౦ది. గో రక్షణ పేరుతో ముస్లింలపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇది హిదువుల పనేనని అమెరికా అన్నది. అందుకే భారత్ లో మత స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు 5 లక్షల డాలర్లను ప్రభుత్వేతర సంస్థలైన ఎన్‌జీఓ లకు అందజేసేందుకు అమెరికా ము౦దుకొచ్చి౦ది. సమాజాన్ని, జర్నలిస్టులను, స్వచ్ఛంద సేవా సంస్థలను చైతన్య పరచడం, మత స్వేచ్ఛను కాపాడడం, మత సంబంధ దాడులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టం ఎం చెబుతోంది, మానవ హక్కులను కాపాడడం ఈ మిషన్ లో భాగమని అమెరికా వెల్లడించింది. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో కార్మికుల రక్షణ, మానవహక్కుల ఉల్లంఘన వంటి 28 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రకటించిన అమెరికా ఇందుకోసం 17 మిలియన్ డాలర్లను కేటాయించింది. అమెరికా నిధులు అందజేసే జాబితాలో భారత్, శ్రీలంక లేనప్పటికీ విపరీతంగా పెరిగిపోతున్న దాడులు, మానవహక్కుల ఉల్లంఘన నేపధ్యంలో ఈ నిధులు అందించడం విశేషం.