పదికి పది @ టీ-20... చరిత్ర లిఖించిన రాజస్థాన్ యువ బౌలర్

SMTV Desk 2017-11-09 11:39:55  t-20 record, ratasthan bowler aakash choudary, disha academy , rajasthan

జైపూర్, నవంబర్ 09 : సాధారణంగా టీ-20 ల్లో మూడు లేదా నాలుగు వికెట్లు తీయడం ఆరుదుగా జరుగుతుంది. కానీ ఏకంగా ఓ రాజస్థాన్ యువ బౌలర్ పది వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా వేసిన నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా, హ్యాట్రిక్ కూడా నమోదు చేయడం విశేషం. ఇదంతా చేసింది రాజస్థాన్ కు చెందిన 15 ఏళ్ల ఆకాష్ చౌదరి అనే యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. భవెర్‌ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా దిశా క్రికెట్ అకాడమీ, పెరల్ జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గి పెరల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా దిశా జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో బరిలోకి దిగిన పెరల్ జట్టు, దిశా క్రికెట్ అకాడమీ బౌలర్ ఆకాష్ చౌదరి ధాటికి 36 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇంతకముందు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పదికి పది వికెట్లు(టెస్టుల్లో) తీసిన ఘనత కుంబ్లే, జిమ్ లేకర్ పేరిట మాత్రమే ఉన్నాయి.