పవన్ విజయవంతం కావాలని ఆశిస్తున్నా : కాంగ్రెస్ నేత దాసోజు

SMTV Desk 2017-11-09 11:18:12  pawan kalyan, congress leader daasoju sravan, janasena party.

హైదరాబాద్, నవంబర్ 09 : ప్రజలతో మమేకమవ్వాలనే ఉద్దేశంతో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ “జనసేన” పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ విషయంపై నాటి ప్రజారాజ్యం నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. “నేను రాజకీయాల్లోకి రావడానికి ఆయనే కారణం. నాటి ప్రజారాజ్యం పార్టీ కార్యక్రమ౦లో కీలక పాత్ర పోషించిన పవన్ లో, ప్రజలకు సేవ చేయాలనే తపన మాత్రం పోలేదు. ఆయన రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆశిస్తున్నా” అంటూ తెలిపారు.