టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల

SMTV Desk 2017-11-08 19:38:31  TSPSC Notification Release, hyderabad

హైదరాబాద్, నవంబర్ 08 ‌:మెడికోలు ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్నతరుణంలో తెలంగాణ వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 1261 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1196 స్టాఫ్‌నర్సులు, 6 ఫిజియో థెరపిస్ట్‌, 35 రేడియోగ్రాఫర్‌, రెండు పారా మెడికల్‌ అఫ్తమాలిక్‌ ఆఫీసర్‌, 21 హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఒక రిఫ్రాక్షనిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ నెల ఈనెల 16 నుంచి డిసెంబరు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. దీంతో ఉద్యోగాలకై వేచిచూసిన వారికి ఈ టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ తీపికబురును అందించినట్ట్లైంది.