కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

SMTV Desk 2017-11-08 18:53:34  CM KCR, Revanth reddy, KODANGAL MEETING ISSUE.

హైదరాబాద్, నవంబర్ 08 : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ అయితే తమ కార్యకర్తల దమ్ము తెలిసేలా కోడంగల్ లో మీటింగ్ పెట్టి తీరాలన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోని కోస్గిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. కోడంగల్ అభివృద్దిని టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బస్ డిపో నిర్మాణం కోసం 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించినా ఇప్పటికీ డిపో నిర్మాణానికి టెండర్లను మాత్రం పిలవడం లేదని విమ‌ర్శించారు. కాగా ఇటీవల రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే.