ఢీ అంటే ఢీ.... రసవత్తర పోరుకు ఫ్రెంచ్ ఓపెన్ సిద్ధం!!

SMTV Desk 2017-06-10 13:06:07  frenchopen, wawrinka, rafel nadel, final match

పారిస్, జూన్ 10 : రసవత్తర పోరుకు ఫ్రెంచ్ ఓపెన్ సంసిద్ధం అయింది..ఆదివారం టాప్ సీడ్ ల మధ్య హోరాహోరి మ్యాచ్ జరుగనుంది. నాదల్, వావ్రింకాల మధ్య ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరం గా సాగనుంది. ఎవరికి వారే గ్రాండ్ స్లామ్ లలో ఫైనల్ కు చేరి వెనుతిరుగని వారు కాక పోవడంతో క్రీడాభిమానుల్లో అత్యంత ఆసక్తి, ఉత్కంఠ నెలకోంది. గత సంవత్సరం ఫైనల్లో ఓటమి చవిచూసిన అండిముర్రేపై సెమిఫైనల్లో గెలుపొంది వావ్రింక ప్రతీకారం తీర్చుకున్నాడు. రఫెల్ నాదేల్ స్పానిష్ కు చెందిన టెన్నిస్ స్టార్ కాగా, వావ్రింక స్విట్జర్లాండ్ కు చెందిన టెన్నిస్ స్టార్. సెమిఫైనల్లో వావ్రింక, అండీముర్రేల మధ్య పోరు హోరాహోరిగా సాగింది. నాలుగున్నర గంటల పాటు హోరాహోరి పోరు సాగిన అనంతరం విజయం వావ్రింకను వరించింది. వావ్రింక 6-7, 6-3, 5-7, 7-6, 6-1 తో ముర్రేను మట్టికరిపించాడు. ఇక మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో రఫెల్ నాదల్ 6-3, 6-4, 6-0తో డొమినిక్ థీమ్ ను చిత్తుచిత్తుగా ఓడించాడు. ఫైనల్ పరంగా చూస్తే ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళ గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి..ఇప్పటి వరకు ఫైనల్ చేరిన ఏ గ్రాండ్ స్లామ్ టోర్నీలోనూ వావ్రింకా ఓడిపోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) ఫైనల్లో నాదల్ ను కంగుతినిపించిన వావ్రింకా..ఫ్రెంచ్ ఓపెన్ (2015), యూఎస్ ఓపెన్ (2016) ఫైనల్లో జొకోవిచ్ ను ఓడించాడు..మరో వైపు ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ ది ఎదురులేని రికార్డు ఫైనల్ చేరిన 9 సార్లు టైటిల్ చేజిక్కించుకున్నాడు.