పంచ్ అదిరింది... స్వర్ణం దక్కింది..

SMTV Desk 2017-11-08 14:52:12  asia boxing champion ship, winner mary kom, opponent kim hyang, vietnam

హోచిమిన్‌ సిటీ, నవంబర్ 08 : ఇండియా టాప్ బాక్సర్ , ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్‌ ఆసియ ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధించి భారత్ కు స్వర్ణం ను అందించింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియా క్రీడాకారిణి కిమ్‌ హ్యాంగ్‌తో పోరాడిన మేరీ కోమ్‌ 5-0తో ఘన విజయం సాధించింది. అయితే 48 కిలోల విభాగంలో మేరీకోమ్‌కి ఇదే తొలి పసిడి పతకం కావడం గమనార్హం. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఆరుసార్లు ఫైనల్ కు చేరుకోగా ఐదు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకొంది.