స్నేహం నేర్పుతుంది...

SMTV Desk 2017-11-08 14:50:16  friend ship, Scientists,

హైదరాబాద్, నవంబర్ 8 : సమాజంలో ఎదుగుతున్న పిల్లలు అంటే బద్ధకం, స్వార్ధం, అనే ధోరణి గల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు కొట్టివేశారు. పిల్లలు తోటి స్నేహితులతో మాట్లాడడం, వారితో ఎక్కువ సేపు గడపటం వల్ల వారికీ ఈ లక్షణాలు దూరం అవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. స్నేహితులతో మెలగడం ద్వారా, చక్కగా నలుగురితో ఎలా నడచుకోవాలి, కొత్త వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలను నేర్చుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు ధోరణి ఎప్పుడూ, స్నేహితులతో తిరిగితే చెడు వైపుకు మళ్లుతారని అనుకుంటారు. పిల్లలు స్నేహం వల్ల, సామాజిక ప్రవర్తన పరంగా విజయాన్ని సాధిస్తారని శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పిల్లలకు స్నేహం, సమాజంలో మెలిగే తీరు, మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుందట. దీన్ని బట్టి పిల్లలకు స్నేహం అనేది చాలా కీలకం.