ధోని విమర్శలపై స్పందించిన విరాట్..

SMTV Desk 2017-11-08 14:30:34  kohli comments on dhoni retirement in t-20, fire on v.v.v laxman, ajith agarkar comments, india team captain, gavaskar

తిరువనంతపురం, నవంబర్ 08 : భారత్ జట్టు మాజీ కెప్టెన్ ధోని పై వస్తున్న విమర్శలపై ప్రస్తుత టీమిండియా సారధి విరాట్ కోహ్లి స్పందించారు. ముఖ్యంగా కివీస్ తో జరిగిన రెండో టీ-20 లో ధోని బ్యాటింగ్ శైలిపై భారత్ మాజీ క్రికెటర్లు వి.వి.ఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వ్యాఖ్యలపై విరాట్ స్పందిస్తూ " అసలు ధోని ని ఎందుకు లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒక ఆటగాడిగా నేను మూడుసార్లు విఫలమైన నన్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ జట్టు విజయాలలో ఆటగాడిగా, నాయకుడిగా దేశం కోసం చాలా చేసిన తన పై అలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు. ధోని మాత్రమే కాదు పాండ్య కూడా ఈ సిరీస్ లో బాగా ఆడలేదు అయిన అతన్ని ఎందుకు టార్గెట్ చేయలేదు. వయసు కారణంగా చూపిన ప్రస్తుతం ధోని చాలా ఫిట్ గా ఉన్నాడు. అంతే కాకుండా శ్రీలంక, ఆసీస్ మ్యాచ్ విజయాల్లో ధోని పాత్ర చాలా కీలకమని మర్చిపోయారా" అని...! కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతక ముందు గవాస్కర్, సెహ్వాగ్ ఇదే విధంగా తమ మద్దతును ధోనికే తెలిపారు.