నిద్రపోనివారు.. మద్యం తాగినవారితో సమానం...

SMTV Desk 2017-11-08 14:06:53  California university scientists, Sleeping test, drinking test.

కాలిఫోర్నియా, నవంబర్ 08 : మానవునికి రోజుకి ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండాలి అంటారు. మన శరీరానికి తగినంత నిద్ర లేకుంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు కొంత ఆశ్చర్యాన్ని, కొంత భయాన్ని కలిగిస్తున్నాయి. నిద్రలేమి, అతిగా మద్యం సేవించడంతో సమానమంటూ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..! అవును ఇది నిజం. నిద్రలేమి కారణంగా మన మెదడులో ఉండే కణాల మధ్య అనుసంధాన శక్తి తగ్గిపోయి జ్ఞాపకశక్తి, దృశ్య గ్రాహకత తగ్గిపోతాయని వారు వెల్లడించారు. దీని కారణంగా మానసిక ఆందోళన పెరిగిపోతుందని తెలిపారు. మద్యం మత్తు వలే ఈ నిద్రలేమితో బాధ పడుతూ ఒకవేళ డ్రైవింగ్ చేస్తే కంటి చూపు తగ్గిపోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడర్ధమయిందా కంటి నిండా నిద్ర ఎందుకు అవసరమో.