రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ ఎంపికనా..?

SMTV Desk 2017-11-08 13:15:44  Chief Minister Arvind Kejriwal, AAP members choice, Rajan is a member of the Rajya Sabha

న్యూఢిల్లీ, నవంబర్ 08 : రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ను పేరును ఆప్‌ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 66 సీట్లు గెలుపొందింది. దీంతో ఢిల్లీ వాటాలో ఆమ్‌ ఆద్మీకి మూడు రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఈ సీట్లు 2018 జనవరికి ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ సభ్యుల ఎంపిక ప్రారంభించింది. అయితే పార్టీ నేతలకు కాకుండా బయటి వ్యక్తులు, ప్రముఖ నిపుణులకు రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌కు సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజన్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సీనియర్‌ ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ కూడా రాజ్యసభ పదవికి పోటీ పడుతున్నారు.