ఇక ట్విట్టర్ లో అక్షరాల పరిమితి ఎంతో తెలుసా..?

SMTV Desk 2017-11-08 12:30:42  twitter letters increase, 140 to 280 , twitter ceo jack dorse, sanfransisco

శాన్‌ఫ్రాన్సిస్కో, నవంబర్ 08 : ప్రఖ్యాత సోషల్ మీడియా ట్విట్టర్ వినయోగదారులకు ఒక శుభవార్త... ఇప్పటి వరకు ట్విట్ చేసేందుకు ఉన్నా అక్షరాల పరిమితిని 140 నుండి 280 వరకు పెంచినట్లు బుధవారం సంస్థ ప్రకటించింది. ఇక నుండి యూజర్లు తమ భావాలను, అభిప్రాయాలను మరింత సులువుగా తెలియచేయవచ్చు. అయితే ఈ అక్షరాల పరిమితి పెంపు, జపనీస్‌, కొరియన్‌, చైనీస్‌ మూడు భాషలకు వర్తించదు.ఈ పరిమితి పరిశీలిన దశలో ఉన్నప్పుడే చాలా మంది యూజర్లు 280 అక్షరాలను వినయోగించి ట్విట్ చేశారు. ఈ సంస్థ ను ప్రస్తుత జాక్ డోర్సే(సీఈఓ అఫ్ ట్విట్టర్) 2006 సంవత్సరంలో స్థాపించారు. ట్విట్టర్ ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత అక్షరాల పరిమితిని తొలిసారి పరిమితిని పెంచడం గమనార్హం.