ఈ నెల 17 వరకు అసెంబ్లీ సమావేశాలు

SMTV Desk 2017-11-08 11:55:15  Assembly meetings until 17th, hyderabad,

హైదరాబాద్‌, నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు సభాపతి అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘ సమావేశంలో నిర్ణయించారు. సదస్సులను ఎప్పటివరకు కొనసాగించాలన్న అంశంపై ఈ నెల 17 న మరోసారి బీఏసీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అంశాలన్నీ చర్చకు వచ్చే వరకు సభ కొనసాగించాలని కోరిన విపక్షాలు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని బీఏసీలో తెలిపాయి. విపక్షల అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాగా, ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాలు తీసుకొని చర్చించాలని కాంగ్రెస్‌, భాజపాలు కోరగా, దీనిపై గత భేటీల్లో నిర్ణయం తీసుకున్నందున దానిలో మార్పు ఉండబోదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రస్తుతం ఎక్కువ రోజులు సమావేశం జరిపమంటూ బర్జేట్ సమావేశాలు కురించరాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమానికి శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పాటు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి (కాంగ్రెస్‌), అక్బరుద్దీన్‌ (మజ్లిస్‌), ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ (భాజపా), సండ్ర వెంకటవీరయ్య (తెదేపా), సున్నం రాజయ్య (సీపీఎం)లు, శాసనసభాకార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.