రూ.500, రూ.1000 నోట్లరద్దుకు ఏడాది....

SMTV Desk 2017-11-08 10:56:10  Demonetisation, modi sarkar, arunjaitli, nirmala sitharaman

న్యూఢిల్లీ, నవంబర్ 08 : 2016 నవంబర్ 8 వ తేదీన, దేశానికి ఓ అభివృద్ధి చోటుచేసుకుంది. అదే పెద్దనోట్ల రద్దు, సరిగ్గా ఈ రోజుకు ఏడాది పూర్తయింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ కీలకమైన అడుగుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వల్ల పెద్ద నోట్ల చలామణీ తగ్గడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ రోజు ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోతే వ్యవస్థలో పెద్దనోట్లు ఎంతగా పెరిగిపోయి ఉండేవో వివరించింది. దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఏడాది క్రితం తీసుకున్నది ఎంతో కీలకమైన నిర్ణయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రవాహం నిలిచిపోయేందుకు, కశ్మీర్‌లో సైనికులపై రాళ్లదాడి ఆగిపోవడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదపడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కానీ విపక్షాలు మాత్రం నేడు దేశవ్యాప్తంగా నిరసన దినంగా నిర్ణయించింది. గత ఏడాది ప్రధాని కీలక ప్రకటన చేసిన సమయాన్ని గుర్తు చేసేలా రాత్రి సరిగ్గా 8 గంటలకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కాగా, డిజిటల్‌ చెల్లింపుల రెండో దశ ప్రోత్సాహానికి ప్రచారాన్ని వచ్చే జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లధనాన్ని నిర్మూలించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోదీ చేసిన కృషి ముందు తరాలవారికి ఎంతో ఉపయోగపడుతుంది.