ఉత్కంఠ పోరులో ఊపేసిన భారత్ ...

SMTV Desk 2017-11-08 10:50:47  india- kiwis 3 rd t-20, india won, tiruvanantha puram, man of the match , bumraa

తిరువనంతపురం, నవంబర్ 07 : న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం నుండి భారత్ లో రసవత్తరంగా సాగింది. వన్డే సిరీస్ లో కోహ్లి సేనకు గట్టిపోటి ఇచ్చిన కివీస్ టీ-20 లో కూడా సమావుజ్జిగా భారత్ తో పోరాడింది. అయితే ఒత్తిడిలో బ్యాట్స్ మెన్ చేతులేత్తియడంతో చివరి టీ-20లో ఓటమిని చవిచూసింది. నిన్న తిరువనంతపురంలో జరిగిన నిర్ణయాత్మక టీ-20 వరుణుడి కారణంగా 8 ఓవర్లకు కుదించబడింది. టాస్ గెలిచి కివీస్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే టీమిండియా కు మాత్రం శుభారంభం దక్కలేదు. భారత్‌ 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (17‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్ లో టిమ్ సౌది, ఇషి సోది రెండు వికెట్లు తీయగా, బౌల్ట్ ఒక వికెట్ తీసి భారత్ బ్యాట్స్ మెన్ల ను కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత్ బౌలర్లు పూర్తిగా కట్టడిచేశారు. నిర్ణిత ఓవర్లలో కివీస్ 6 వికెట్ల కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా ప్రపంచ ఉత్తమ బౌలర్, డెత్ ఓవర్ స్పెసిలిస్ట్ బుమ్రా తన బౌలింగ్ తో(2/9 ) మరోసారి భారత్ కు విజయాన్ని అందించాడు. అంతే కాకుండా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ,‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ , యాదవ్ ఒక్కొక్క వికెట్ పొందగా, చాహల్ కూడా రాణించాడు. ఈ విజయంతో కోహ్లి సేన 2-1 తేడాతో సిరీస్ ను తమ ఖాతాలో వేసుకుంది.