మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు..

SMTV Desk 2017-11-07 19:37:45  aashis pacer starc record, shafle field tounment, sydney, new southwales

సిడ్నీ, నవంబర్ 07 : ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు ను నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ లో భాగంగా షెఫల్డ్ షీల్డ్ మ్యాచ్ లో స్టార్క్ రెండు హ్యాట్రిక్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూసౌత్ వేల్స్ ఆటగాడైన స్టార్క్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. స్టార్క్ చెలరేగడంతో న్యూసౌత్ వేల్స్ జట్టు 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 23 న జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముందు స్టార్క్ ప్రదర్శనతో ఆ జట్టు ఉత్సాహంగా ఉంది.