వాయు కాలుష్యంతో జాగ్రత్త...

SMTV Desk 2017-11-07 19:08:46  Air pollution, delhi, doctors

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. రాజధానిగా ఉన్న ఢిల్లీ ప్రస్తుతం అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 19న జరగాల్సిన ఎయిర్‌టెల్‌ ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌ రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వైద్యుల సంఘం లేఖ రాసింది. గాలిలో మోతాదుకు మించి కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడం వల్లే కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ ధరించాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలోని పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పిల్లలను ఇళ్లలోంచి బయటకు పంపవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాయుకాలుష్యం ప్రభావంతో ఢిల్లీ నుంచి ఏడు విమానాలు ఆసల్యంగా రాకపోకలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వాయు కాలుష్యంతో ఎవరికీ ఎలాంటి హాని కలుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హేచరికలు చేసింది.