భరణం కోసం.. కిడ్నీ బేరం...

SMTV Desk 2017-11-07 18:51:31  Kidney selling for alimony, madhyapradesh news update.

మధ్యప్రదేశ్, నవంబర్ 07 : విడాకులు తీసుకున్న భార్యకు భరణం ఇచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నీనే అమ్మాలనుకున్నాడు. ఇందుకోసం పెద్ద తతంగమే చేశాడు. వివరాల్లోకి వెళితే.. విదీషాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. కాని అతని భార్య తనకు భరణం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏం చేయాలో అర్ధం కాని ఆ వ్యక్తి తన కిడ్నీని అమ్మాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు. అది చూసి చాలా మంది అతనిని సంప్రదించారు. కాని ఆ వ్యక్తి రూ.50 లక్షలకు తన కిడ్నీని బేరం పెట్టడంతో ఎవరు ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక అతను మీడియాను ఆశ్రయించాడు. తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని తన భార్యకు భరణం చెల్లించడానికే ఇదంతా చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.