ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ అమిత్ షా...

SMTV Desk 2017-11-07 18:19:05  Gujarat State Assembly, BJP national president Amit Shah, Campaign

అహ్మదాబాద్, నవంబర్ 07 ‌: గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ కి వచ్చే నెల 9, 14 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమిత్‌ షా ఇంటింటికీ ఓటర్లను పలకరించి భాజపాకు ఓటేయాలని అభ్యర్థించారు. 50 వేల పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఓటర్లు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎమ్మెల్యేగా వ్యవహరించిన నారాయణపుర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు అమిత్‌ షా ప్రారంభించారు. డిసెంబర్‌ లో నిర్వహించే ఈ ఎన్నికలు ఫలితాలు అదే నెల 18 న తెలుపనున్నట్లు సమాచారం.