గందరగోళంలో ఐటీ కంపెనీలు

SMTV Desk 2017-06-10 11:32:52  it companis, infosys, wipro, naryanamurthy, azimepremji

ముంబాయి, జూన్ 10 : భారత దేశంలో ఐటీ దిగ్గజ కంపెనీలలో గందరగోళ పరిస్థితులు నెలకోన్నాయి. ఆ కారణంగా ఆ కంపెనీల షేర్లు షేర్ మార్కెట్ లో పతనం దిశ ప్రయాణిస్తున్నాయి.శుక్రవారం ఇన్ఫోసిస్ సుమారు 3.45 శాతం పతనం చెందగా, విప్రో 2 శాతం పతనం కు చేరడం తో ఆందోళన పరిస్థితులు నెలకోన్నాయి. ఆయా సంస్థలకు గట్టి పునాదులు వేసిన వ్యవస్థాపకుల తీవ్ర అసంతృప్తి కారణంగానే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని ఆందోళన వ్యక్తం చేయడం ఇందుకు ఊతం ఇస్తోంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులకు భారీ వేతనాలు, వీడ్కోలు పలికిన వారికి భారీ పారితోషకాలే ఆయా సంస్థల వ్యవస్థాపకుల అసంతృప్తికి కారణమన్నవిశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఆ కారణంగా సహా వ్యవస్థాపకులు తమ వాటాను విక్రయించనున్నారనే పత్రికా వార్తల నేపథ్యంలో షేర్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు పతనం దిశగా నడిచాయి. అదే తరహాలో విప్రోలోను వాటాలను విక్రయిస్తున్నారనే ఉహాగానాలతో ఆ కంపెనీ షేర్లు సయితం పతనం అయ్యాయి.కాని విప్రో వాటాల్లో మూడవ వంతుకు పైగా వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ కుటుంబానికి చెందినవి కావడంతో విక్రయ వాదనలకు అంతగా బలం చేకూరలేదు. ఏది ఏమైనా వ్యవస్థాపకుల అసంతృప్తి కారణంగా ఆ సంస్థలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీ బలోపేతానికి పనిచేయాలి తప్ప భారీ వేతనాలు, పారితోషకాలతో కంపెనీని నష్టాల బాట పట్టిస్తున్నారనే వ్యవస్థాపకుల ఆందోళన నేపథ్యమే ప్రస్తుత గందరగోళానికి కారణం.