కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ బహు ప్రియం..!

SMTV Desk 2017-11-07 18:02:02  india cricket captain kohli, social media instant gram , top list in brand , after lionel messy

హైదరాబాద్, నవంబర్ 07 : టీమిండియా క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ప్రస్తుతం సూపర్ ఫాం తో దూసుకుపోతున్నారు. తన ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలితో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా చాలా అగ్రశ్రేణి సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వీటిపై విరాట్ వందల కోట్లు అర్జిస్తున్నాడు. బ్రాండ్ విలువలో ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్‌ మెస్సీని సైతం దాటేశాడు. ధోని తర్వాత సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ కోహ్లికి ఉంది. విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌ను 16.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తికి సంబంధించిన ఫోటో ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే కోహ్లికి రూ.3.2 కోట్లు చెల్లించాలని సమాచారం... ఏది ఏమైనా కోహ్లి అన్ని రంగాల్లో తన దైన ట్రెండ్ మార్క్ తో సోషల్ మీడియా లో కూడా సత్తా చాటుతున్నారు.