ఏటీఎంలో సగం నోటు..!!

SMTV Desk 2017-11-07 17:59:11  Man gets half-printed note, Rs 2,000 note from ATM.

న్యూఢిల్లీ, నవంబర్ 07 : దేశ రాజధాని ఢిల్లీలో దొంగ నోట్ల విషయం కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం వద్దకు వచ్చి రూ.10 వేలు డ్రా చేశాడు. ఆ డబ్బులను లెక్కపెడుతు౦డగా ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతను లెక్కించే ఆ 2వేల నోట్లలో ఒకటి సగానికే ప్రింట్ అయి ఉంది. మిగతా సగం తెల్ల కాగితాన్ని అంటించి ఉంది. దీంతో ఒక్కసారి షాక్ తిన్న అతను కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాడు. వారు బ్యాంకును సంప్రదించమనగా వెంటనే తన ఖాతా ఉన్న బ్యాంకు(యస్‌ బ్యాంక్‌)లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. అనతరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ(సౌత్‌ఈస్ట్‌) రోమాలి బానియా తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.