ప్రభుత్వ తరహాలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు...

SMTV Desk 2017-11-07 16:40:30  Bihar Chief Minister Nitish Kumar, Reservations in the private sector

పట్నా, నవంబర్ 07 : గతేడాది ఏప్రిల్‌లో సైతం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లలాగే ఉండాలని నితీశ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)తో పాటు దివ్యాంగులకు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రభుత్వఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటా 50శాతానికి మించి ఉండాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు పాటించాలని వెల్లడించారు. ప్రైవేటు రంగంలోనూ ఈ రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.