దూసుకెళ్తాం....11 శాతం వాటకై పరుగు!!!

SMTV Desk 2017-06-10 11:26:02  bsnl, telcomministare,wifi hotspot,

న్యూఢిల్లీ, జూన్ 10 : ప్రైవేటు టెలికాం ఆపరేటర్లతో పోటిపడలేక చతికిలపడుతున్న బిఎస్ ఎన్ఎల్ కు కాయకల్ప చికిత్సను మెుదలు పెట్టారు. నిర్ద్యేశిత లక్ష్యాలను విధిస్తూ మార్కెట్ లో వాటా ను పెంచుకునేందుకు మార్గదర్శనం చేస్తున్నారు. వైఫై సేవల కోసం బీఎస్ ఎన్ ఎల్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ సంస్థల మధ్య ఒప్పంద కార్యక్రమంలో టెలికాం మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతు ఇందుకు సంబంధించి పలు విష యాలను వెల్లడించారు. అందులో భాగంగా రాబోయే 12 నెలల్లో దేశీయ టెలికాం విపణిలో 11 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే బీఎస్ ఎన్ ఎల్ మార్కెట్ వాటా 9.05 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగిందని ..మరో సమీక్షలోగా పదిశాతం కంటే తగ్గరాదని ఒకవేళ మార్కెట్ వాటా 11 శాతం దాటితే బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రాడ్ బ్యాండ్ సేవలకు తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలిదశను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశిస్తు..రోజుకు వెయ్యి గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఆరంభించాలన్న లక్ష్యంతో కృషి చేయాలని సూచించారు. వైఫై సేవల భాగస్వామ్య ఒప్పందం లో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు 942 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. మూడేళ్ళ పాటు నిర్వహణ ఖర్చులు కూడా ప్రాజెక్ట్ లో ఉన్నాయని వెల్లడించారు.